![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -362 లో..... బెస్ట్ రెస్టారెంట్ అవార్డు వచ్చినందుకు దీప వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. నాన్న రేపు అవార్డు ఫంక్షన్ కి ఈ డ్రెస్ వేసుకుంటానని శౌర్యా అంటుంది. రేపు మీరందరు ఎందుకు నేను ఒక్కడిని వెళ్తానని కార్తీక్ అంటాడు. మేమ్ కూడా వస్తామని అందరు అంటారు. రేపు అవార్డు అందుకునేది నేను కాదని ఎలా చెప్పాలని కార్తీక్ తన మనసు లో బాధపడతాడు.
మరుసటి రోజు ఉదయం అవార్డు ఫంక్షన్ కి జ్యోత్స్న వెళ్తుంది. తను కార్తీక్ ప్లేస్ లో కూర్చుంటుంది. అప్పుడే సత్యరాజ్ వచ్చి ఈ సీట్ కార్తీక్ ది అని అంటాడు. ఇది అవార్డు అందుకునే వాళ్ళదని సత్యరాజ్ అనగానే అవార్డు నేనే అందుకుంటున్నానని జ్యోత్స్న అంటుంది. అప్పుడే కార్తీక్ తన కుటుంబంతో వస్తాడు. జ్యోత్స్న అవార్డు అందుకునేది నేనే అంటుందని కార్తీక్ తో సత్యరాజ్ అంటాడు. అప్పుడే శివన్నారాయణ అక్కడికి వస్తాడు. ఇక్కడికి ఎందుకు వచ్చావ్ జ్యోత్స్న.. నా పరువు తియ్యడానికా అని జ్యోత్స్నని శివన్నారాయణ కోప్పడతాడు. బావపై ఉన్న హక్కులన్నీ మనకి మార్చబడ్డాయ్ ఇప్పుడు అవార్డు అందుకునేది నేనే అని అగ్రిమెంట్ చూపిస్తుంది. అక్కడున్న వాళ్ళకి ఏం అర్ధం కాదు.
కార్తీక్ కూడ సైలెంట్ గా ఉంటాడు. జ్యోత్స్న ఏం అంటుంది రా అని కాంచన అడుగుతుంది. నా కొడుకు గెలిచాడని ఓర్వలేక నువ్వు ఇలా మనవరాలిని పంపించావ్ కదా అని తన తండ్రి శివన్నారాయణతో కాంచన అంటుంది. ఆ తర్వాత కార్తీక్ స్టేజ్ పైకి వెళ్లి.. ఈ అవార్డు ఫంక్షన్ లో చిన్న మార్పు.. అవార్డు అందుకునేది నేను కాదు జ్యోత్స్న అని అనగానే దీప షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |